SP బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన కుటుంబ సభ్యులు.. ఫోటో వైరల్

సింగర్ ఎస్.పి.బాలాసుబ్రమణ్యం హెల్త్ కండిషన్ పై ఇటీవల అనేక రకాల వార్తలు అభిమానులు, సంగీత ప్రియులను కొంత ఆందోళనకు గురి చేసిన విషయం తెలిసిందే. అయితే ఎంజిఎం హెల్త్‌కేర్ అధికారులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

బాలు కుటుంబ సభ్యులు వస్తున్న రూమర్స్ ని కొట్టి పారేస్తు ఆయన ఆరోగ్యంగా ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. ఎస్పీబీ కుమారుడు ఎస్పీ చరణ్ కొద్దిసేపటి క్రితం తమిళ మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి ఆరోగ్యం బాగానే ఉందని ఇప్పుడిపుడే కోలుకుంటున్నారని వివరణ ఇచ్చారు. ఎస్పీ వసంత కూడా మీడియాకు ఆడియో సందేశాన్ని విడుదల చేస్తూ.. అభిమానులందరి ప్రేమ వల్ల ప్రార్ధన వల్ల ఆయన బాగున్నరని తెలియజేసారు. అదే విధంగా బాలసుబ్రహ్మణ్యంకి సంబంధించిన ఒక స్పెషల్ ఫోటోను రిలీజ్ చేయగా అందులో బాలు గారు నవ్వుతూ తాను బాగానే ఉన్నానని సిగ్నల్ ఇచ్చారు.