స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రామ్ చరణ్.. న్యూ లుక్ వైరల్

74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను రామ్ చరణ్ ప్రత్యేకంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ లో కార్యాలయంలో నిర్వహించారు. శనివారం ఉదయం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు అల్లు అరవింద్ కూడా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా తక్కువమంది అతిధుల సమక్షంలోనే స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు.

జాతీయ పతాకానికి వందనం చేసిన అనంతరం భారతమాత, గాంధీజీ చిత్రపటాలకు పూల మాల వేసిన రామ్ చరణ్ సుమాంజలి అర్పించారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ సిబ్బందితో పాటు చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు పాల్గొన్నారు. ఇక స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రామ్ చరణ్ ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఆయన న్యూ లుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెక్స్ట్ చరణ్ RRR సినిమాలో స్వాతంత్ర సమర యోధుడైన అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.