Balayya: మ‌రోసారి అభిమాని చెంప వాయించిన బాల‌య్య‌..

Balayya: నంద‌మూరి న‌ట‌సింహం, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ మ‌రోసారి ఆగ్రహానికి లోన‌య్యారు. అభిమాని చెంప వాయించారు. వీడియో ఎందుకు తీస్తున్నావ్‌.. వెంట‌నే డిలీట్ చెయ్ అంటూ ఆగ్ర‌హంతో ఊగిపోయారు. దీంతో టీడీపీ శ్రేణులు ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌‌య్యారు. ఏపీలో త్వ‌ర‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌ర‌గనున్న నేప‌థ్యంలో టీడీపీ ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు.

ఇందులో భాగంగానే మూడు రోజులుగా విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారుBalayya. నీల‌కంఠపురంలో 9వ వార్డు టీడీపీ అభ్య‌ర్థి ఇంటికి వెళ్లాడు బాల‌య్య‌. వారితో మాట్లాడుతుండ‌గా.. ఓ యువ‌కుడు వీడియో తీసే ప్ర‌య‌త్నం చేశాడు. దీంతో బాల‌య్య వీడియో రికార్డింగ్ ఆపేయాల‌ని స‌ద‌రు యువ‌కుడికి సూచించారు. అయిన‌ప్ప‌టికీ ఆ యువ‌కుడు వీడియో తీయ‌డం కొన‌సాగిస్తుండ‌డంతో మండిప‌డిన Balayya బాల‌య్య ద‌గ్గ‌రికి వ‌చ్చి ఆ యువ‌కుడి చెంప చెళ్లుమ‌నిపించారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.‌