Uppena Movie: 100కోట్ల క్ల‌బ్‌లోకి చేరిన ఉప్పెన మూవీ..

Uppena Movie: మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్‌తేజ్ న‌టించిన ఉప్పెన చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యం సాధించిన‌ విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా డైరెక్ష‌న్ చేయ‌గా.. ఇందులో వైష్ణ‌వ్‌కు జోడీగా కృతిశెట్టి హీరోయిన్ న‌టించి ప్రేక్ష‌కుల‌ను ఎంతో మెప్పించింది. ఇక ఈ చిత్రంలో ప్ర‌ముఖ కోలీవుడ్ స్టార్ మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్‌సేతుప‌తి విల‌న్ పాత్ర‌ను చేయ‌డంతో.. ఈ సినిమాపై భారీ అంచ‌నాల‌ను పెంచేసింది.. Uppena Movie ఇందులో ఆయ‌న న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఎంతో ఫిదా అయ్యారు.

ఈ చిత్రం ప్రేమ‌క‌థ ఆధారంగా తెర‌కెక్కి.. ప్రేమ‌క‌థ‌ల్లో ఒక సంచ‌ల‌నంగా నిలిచింది. అలాగే ఈ చిత్రానికి దేవీశ్రీ‌ప్ర‌సాద్ ఇచ్చిన మ్యూజిక్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకున్నాయి. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామిని కురిపించింది.. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఈ చిత్రంపై ప్ర‌శంస‌లు కురిపించారు. ఇక తాజాగా ఈ Uppena Movie చిత్రం మ‌రో రికార్డును నెల‌కొల్పింది. 100కోట్ల గ్రాస్ క్ల‌బ్ అంటూ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది మైత్రీ మూవీ మేక‌ర్స్‌.. ఉప్పెనంత మీ ప్రేమ‌కు ధ‌న్య‌వాదాలు అంటూ ఆనందం వ్య‌క్తం చేసింది.‌