ఎన్టీఆర్‌ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన చంద్రబాబు, బాలయ్య

టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు నివాళులు అర్పిస్తున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌ను పూలతో అలంకరించారు. ఎన్టీఆర్ కుమారులైన బాలకృష్ణ, రామకృష్ణతో పాటు పలువురు కుటుంబ సభ్యులు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు అన్నగారికి ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద తన తండ్రి రామారావుకు బాలకృష్ణ నివాళులు అర్పించిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

balakrishna at ntr ghat

ఇక తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ ఎన్టీఆర్ ఘాట్‌కి చేరుకుని నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ శ్రేణులు, అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.