మ‌రోసారి ధ‌నుష్‌తో త‌మ‌న్నా రొమాన్స్‌!

క‌మ‌ర్షియ‌ల్ న‌టుడిగా ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న హీరో ధ‌నుష్‌. తాజాగా ధ‌నుష్ న‌టిస్తున్న త‌మిళ‌ చిత్రం నాన్ వారువేన్ తెలుగులో (నేను వ‌స్తాను) అత‌ని సోద‌రుడు సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. కాగా త‌మిళంలో ధ‌నుష్‌, సెల్వ‌రాఘ‌వన్‌ది కాంబోలో తెర‌కెక్కిన పుదుపేటైట్‌(ధూల్‌పేట్‌), మ‌య‌క్క‌మ్ ఎన్న (మిస్ట‌ర్ కార్తీక్‌) వంటి సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి.

మ‌రోసారి ఈ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న‌ నాన్ వ‌రువేన్(నేను వ‌స్తాను) చిత్రంలో మూడోసారి ధ‌నుష్‌తో మిల్క్‌బ్యూటీ త‌మన్నా జోడి క‌ట్ట‌బోతుంది. ఇదివ‌ర‌కు గ‌తంలో వీరిద్ద‌రు జోడీగా ప‌డిక్కాద‌వ‌న్‌, వేంగై చిత్రాల్లో న‌టించారు. మ‌ళ్లీ కొన్నేళ్ల గ్యాప్ త‌ర్వాత (నాన్ వ‌రువేన్) నేను వ‌స్తాను అంటూ వీరిద్ద‌రు క‌ల‌వ‌నున్నారు. ఇదిలా ఉంటే నాన్ వారువేన్ చిత్రం గ్యాంగ్ స్ట‌ర్ కథాంశంతో రూపొందుతుంద‌ని చిత్ర‌బృందం నుంచి అందిన‌ స‌మాచారం.