‘బాక్’ మే3న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్

అత్యంత విజయవంతమైన హారర్ కామెడీ సిరీస్ ‘అరణ్మనై’ నుంచి నాల్గవ చిత్రం అరణ్మనై 4 తెలుగులో ‘బాక్’ పేరుతో వస్తోంది. సుందర్ సి దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, రాశి ఖన్నా హీరోయిన్స్.  

ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న విడుదల చేయడానికి తొలుత సన్నాహాలు చేశారు మేకర్స్. అయితే ఎండల తీవ్రత అధికంగా వుండటం వలన విడుదల తేదిని వాయిదా వేస్తూ కొత్త తేదిని తెలియజేశారు. మే 3న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన  ‘పంచుకో’ పాట అద్భుతమైన రెస్పాన్స్ తో చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. త్వరలోనే ట్రైలర్ ని విడుదల చేసి తెలుగు ప్రమోషన్స్ ని దూకుడుగా చేయబోతున్నారు మేకర్స్.

తారాగణం: సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా, వై వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్,  కోవై సరళ

సాంకేతిక సిబ్బంది:
కథ & దర్శకత్వం: సుందర్ సి
నిర్మాతలు: ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్
బ్యానర్: అవ్నీ సినిమాక్స్క్స్ P Ltd.
తెలుగు రిలీజ్: ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి
సంగీతం: హిప్హాప్ తమిళా
సినిమాటోగ్రాఫర్: ఇ కృష్ణమూర్తి అకా కిచ్చ
ఎడిటర్: ఫెన్నీ ఆలివర్
ఆర్ట్: గురురాజ్
కొరియోగ్రఫీ: బృందా మాస్టర్
స్టంట్స్: రాజశేఖర్
పీఆర్వో: వంశీ-శేఖర్