సోమవారం కోర్టు కు హాజరు కానున్న నటి హేమ

బెంగళూరు రేవ్ పార్టీ సంఘటన అందరికి తెలిసిందే. ఇటీవలే ఈ విష్యం అంతటా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ పార్టీ లో తెలుగు సినిమా నటి హేమ కూడా ఉండటంతో మరింత అత్తెంతిఒన్ పొందింది ఈ సంఘటన. హేమ తాను ఎటువంటి రేవ్ పార్టీ కి వెళ్లలేదని, ఇది అంట పుకారు అని, తాను హైదరాబాద్ లోనే ఓ గెస్ట్ హౌస్ లో ఉన్నాను అంటూ ఓ వీడియో ద్వారా అందరిని తప్పు దారి పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ, బెంగళూరు పోలీసులు హేమ ఫొటోతో సహా విడుదల చేసి హేమ రేవ్ పార్టీలో దొరికారంటూ నిర్దారణ చేసారు. అంతే కాకుండా వీడియో ద్వారా తప్పు సమాచారం ప్రచారం చేయడానికి ప్రయత్నించినందుకుగానూ బెంగళూరు పోలీసులు మండిపడ్డారు. ఇది ఇలా ఉండగా ఇటీవలే బ్లడ్ శాంపిల్ టెస్ట్ రెస్యూల్ట్లు వెల్లడించారు పోలీసులు. అయితే ఆ టెస్ట్ రిపోర్టులో నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిసింది. ఇందుకుగాను నటి హేమాను బెంగళూరు కోర్టుకు సోమవారం హాజరు కావలసిందిగా నిర్దేశించడం జరింగింది అని సమాచారం.