ఆస్కార్ అవార్డు విన్నర్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఏ ఆర్ రెహమాన్ తల్లి కరీమా బేగం ఇవాళ కన్నుమూశారు. వయస్సు సంబంధిత అనారోగ్యంతో గత ఏడాది కాలంగా ఆమె బాధపడుతూ ఇవాళ మరణించింది. సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే రెహహాన్.. గత కొంతకాలంగా పనిని తగ్గించుకుని కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు. ముఖ్యంగా తన తల్లితో గత కొంతకాలంగా ఎక్కువ గడుపుతున్నాడు.
తల్లి మృతితో రెహమాన్ ఇంట్లో విషాద చాయలు అలుముకున్నాయి. రెహమాన్ కుటుంబానికి పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. తల్లి మరణంతో రెహమాన్ విషాదంలో మునిగిపోయారు. ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ శేఖర్ కుమారుడు ఏఆర్ రెహమాన్. 1976లో అంటే.. రెహమాన్ తొమ్మిదేళ్ల వయస్సుల్లో ఉన్నప్పుడే తండ్రి శేఖర్ చనిపోయారు. అప్పటి నుంచి పిల్లలను కరీమా బేగం పెంచింది.
కరీమా బేగానికి నలుగురు సంతానం. అందులో రెహమాన్ చిన్నవాడు. తన మ్యూజిక్‌తో రెహమాన్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. తాను తొమ్మిదేళ్ల వయస్సులోనే తండ్రిని కోల్పోయిన రెహమాన్.. ఇప్పుడు తల్లిని కూడా కోల్పోవడంతో విషాదంలో మునిగిపోయారు.