కేజీఎఫ్-2లో బాలయ్య

నందమూరి నటసింహం బాలకృష్ణ కేజీఎఫ్-2 సినిమాలో నటించారా?.. అంటే అవుననే చెబుతోంది గూగుల్. గూగుల్‌లో కేజీఎఫ్ -2 అని సెర్చ్ చేయగానే.. అందులో నటించిన నటులు పేర్లు వస్తున్నాయి. అందులో బాలయ్య ఫొటోతో పాటు పేరు కూడా కనిపిస్తోంది. దీంతో బాలయ్య ఇందులో నటించారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇనాయత్ ఖలీల్ పాత్రలో బాలయ్య నటించాడని గూగుల్‌లో చూపిస్తుంది.

BALAYYA

కానీ ఆ పాత్రలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ నటించాడు. దానికి బదులు బాలయ్య పేరు చూపించడం ఆశ్చర్యకరంగా మారింది. గూగుల్ తప్పుగా చూపించిందని దీనిని బట్టి అర్థమవుతోంది. ఈ ఏడాదిలో గూగుల్ చేసిన పెద్ద తప్పు ఇదేనని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అప్పుడప్పుడు గూగుల్‌లో ఇలాంటి తప్పులు దొర్లతూ ఉంటాయి. ఇప్పుడు ఇదేమీ కొత్త కాదు.

పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న కేజీఎఫ్ 2 సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తవ్వగా.. జనవరి 8న ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. వచ్చే సమ్మర్‌లో ఈ సినిమాను విడుదల చేయనున్నారని తెలుస్తోంది.