రచయితల సంఘం అధ్యక్షుడు ఏల్చూరి వెంకట్రావు గారి తనయుడు రంజిత్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది..?’. వి.జి.ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై వీరాస్వామి జి. దర్శకనిర్మాతగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. నారా రోహిత్ ట్రైలర్ లాంచ్ చేశారు. రచయిత పరుచూరి గోపాల కృష్ణ, హీరో శ్రీవిష్ణు వీడియో బైట్ ద్వారా చిత్రయూనిట్ కి ఆల్ ద బెస్ట్ చెప్పారు.
పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ..‘తెలుగు సినీ రచయితల సంఘంలో మొట్టమొదటి వ్యక్తి ఏల్చూరి వెంకట్రావు. నేను చేరేప్పటికీ నా నెంబర్ 49, మా అన్నయ్య నెంబర్ 36. అసోసియేషన్ ని క్రియేట్ చేసి రచయితలకు మేలు చేయాలన్న ఆలోచన ఉన్న ఏల్చూరి గారి అబ్బాయి రంజిత్ వాళ్ల నాన్నలాగానే ఆయుర్వేద డాక్టర్ అవుతాడనుకున్నా. కానీ యాక్టర్ అయ్యాడు. ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది..?’ ట్రైలర్ నన్ను బాగా ఆకట్టుకుంది. మాటకు గానీ, పాటకు గానీ, కథకు గానీ దేనికైనా ఇన్ స్పిరేషన్ సమాజం నుంచే వస్తుంది. ఈ చిత్రదర్శకుడు వీరాస్వామికి మంచి కథతో ముందుకొస్తున్నాడు. ట్రైలర్ లో ఉన్న కాసేపు చూస్తేనే రంజిత్ నటన అద్భుతంగా చేశాడనిపించింది. తప్పకుండా అందరూ ఈ సినిమా చూడాలి’అన్నారు.
హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ..‘‘ఏప్రిల్ 28 ఏం జరిగింది..?’ ట్రైలర్ చాలా బాగుంది. నా క్లోజ్ ఫ్రెండ్ రంజిత్, అజయ్, రాజీవ్ కనకాల, తనికెళ్ల భరణి అందరూ కలిసి నటించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందరూ తప్పకుండా ఈ సినిమా చూసి కొత్త టీమ్ కి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నా. చిత్రయూనిట్ అందరికీ ఈ సినిమాతో మంచి పేరు రావాలని కోరుకుంటున్నా’అన్నారు.
నారా రోహిత్ మాట్లాడుతూ..‘రంజిత్ నాకు గుడ్ ఫ్రెండ్. థ్రిల్లర్ జానర్స్ ఇప్పటికే చాలా వచ్చాయి. ఈ సినిమా కూడా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. మంచి సక్సెస్ సాధించాలని టీమ్ మొత్తానికి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను’అన్నారు.
దర్శకనిర్మాత వీరాస్వామి మాట్లాడుతూ..‘ఇండస్ట్రీకి రావాలని చాలామంది తపన పడుతుంటారు. నేను కూడా డ్యాన్సర్ గా, డ్యాన్స్ మాస్టర్ గా 20ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. దర్శకుడు కావాలనే నా కలను రంజిత్ గారు నెరవేర్చారు. రంజిత్ నాకు 10సంవత్సరాల నుంచి తెలుసు. ఈ సినిమా విషయంలో అన్ని రకాలుగా నాకు సపోర్ట్ చేశారు. మా పేరెంట్స్ తర్వాత దర్శకుడిగా నా జన్మనిచ్చిన రంజిత్ గారికి ధన్యవాదాలు. థ్రిల్లర్ జానర్ లో తీసిన సినిమా ఇది. కంప్లీట్ ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రం. సెన్సార్ సభ్యులు చాలారోజుల తర్వాత మాకు మంచి సినిమా చూపించావనడం హ్యాపీగా అనిపించింది. తనికెళ్ల భరణి కూడా కొత్త పాయింట్ ఇది..కొత్త దర్శకులు ఇండస్ట్రీకి రావాలన్నారు. నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. జనవరి 22న ఈ సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం. ట్రైలర్ లాంచ్ చేసిన నారా రోహిత్ కి స్పెషల్ థ్యాంక్స్’చెప్పారు.
ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ మాట్లాడుతూ..‘ఈ చిత్ర ఆడియో రైట్స్ మాకు ఇచ్చిన చిత్రయూనిట్ కి అన్ని రకాలుగా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం’అన్నారు.
స్ర్కీన్ ప్లే అందించిన హరి ప్రసాద్ మాట్లాడుతూ..‘కొత్త సంవత్సం కొత్త సినిమాతో వస్తున్నాం. మూవీ టీమ్ మొత్తానికి ఆల్ ద బెస్ట్’అన్నారు.
హీరో రంజిత్ మాట్లాడుతూ..‘నన్ను విష్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా క్లోజ్ ఫ్రెండ్ నారా రోహిత్ కి థ్యాంక్స్. ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది..?’అనే సినిమా 2019 ఏప్రిల్ లో మొదలైంది. వీరాస్వామి చెప్పిన స్టోరీలైన్ నాకు నచ్చడం దానిని డవలప్ చేయడం అన్నీ వెంటవెంటనే పూర్తిచేసి మేలో షూటింగ్ స్టార్ట్ చేశాం. 25రోజుల్లో సింగిల్ షెడ్యూల్ లోనే దాదాపు షూటింగ్ పూర్తిచేశాం. కొంతమాత్రమే బ్యాలెన్స్ ఉంది. కోవిడ్ వల్ల వచ్చిన అనర్ధాలకు అన్ని రంగాలు కుదేలైనా సంగతి తెలిసిందే. చిత్రపరిశ్రమ కూడా చాలా నష్టపోయింది. డైరెక్టర్ వీరాస్వామి గారు ఆయన తల్లిని కూడా కోల్పోయారు. అలాగే మా మూవీకి పనిచేసిన కిశోర్ గారు రీసెంట్ గా కరోనాతో చనిపోయారు. ఇలాంటి బాధాకరమైన విషయాలు ఎన్ని జరిగినా ఒక ధ్వజస్తంభంలా నిలిచి సినిమా ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చిన వీరాస్వామికి కృతజ్ణతలు తెలియజేస్తున్నాను. ఈ కాన్సెప్ట్ కు నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా నాకు సహకరించారు. నా ఫ్రెండ్స్ లేకపోతే ఈ మూవీ అయ్యేది కాదు. నా తల్లిదండ్రుల విషెస్ నాకు ఎప్పుడూ ఉన్నాయి కాబట్టే నేను ఈ స్టేజ్ లో ఉన్నాను. ఇది నా రెండో సినిమా అల్రెడీ కన్నడలో అవధి అనే సినిమా చేశాను. తెలుగులో అయితే ఫస్ట్ మూవీ. ఫస్ట్ సినిమా అయినా నటీనటులు, టెక్నిషియన్స్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీశాం’అన్నారు.
నటీనటులు : రంజిత్, షేర్లీ అగర్వాల్, అజయ్, తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, తోటపల్లి మధు, జబర్ధస్త్ దీవెన తదితరులు.
టెక్నిషియన్స్ :
మ్యూజిక్ : సందీప్ కుమార్
ఎడిటర్ : సంతోష్
డి.ఓ.పి. : సునీల్ కుమార్.ఎన్.
స్ర్కీన్ ప్లే : హరి ప్రసాద్ జక్కా
దర్శకులు, నిర్మాత : వీరా స్వామి జి.
పి.ఆర్.ఓ. : మాడూరి మధు