జేమ్స్ బాండ్ నటి కన్నుమూత

జేమ్స్ బాండ్ 007 సిరీస్ నటి తన్య రాబర్ట్ ఇవాళ మరణించారు. అనారోగ్యంతో గత కొద్దిరోజులుగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. ఇటీవల పెంపుడు కుక్కతో వాకింగ్‌కు వెళ్లిన సమయంలో ఒక్కసారిగా ఆమె కుప్పకూలి కింద పడిపోయింది. దీంతో స్థానికులు గుర్తించి వెంటనే లాస్ ఏంజిల్స్‌లోని సెడార్-సినార్ హాస్పిటల్‌కు తరలించారు.

JAMES BOND ACTOR DIED
JAMES BOND ACTOR DIED

ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి గత కొద్దిరోజులుగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం మరింత విషమించడంతో కొద్దిసేపటి క్రితం మరణించారు. ఆమె వయస్సు 65 సంవత్సరాలు. మెడల్‌‌గా కెరీర్‌ను ప్రారంభించిన తన్య రాబర్ట్.. 1975లో వచ్చిన ఫోర్స్‌డ్ సినిమాతో హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

ఈ తర్వాత 1985లో వచ్చిన జేమ్స్ బాండ్ 007 సినిమాతో ఆమె మంచి పేరు తెచ్చుకుంది. ఆ సినిమాలో అమెరికన్ భూవిజ్ఞాన శాస్త్రవేత్త స్టాసే సుట్టన్ పాత్ర పోషించారు.