జగన్‌కు మరో భారీ షాక్.. త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్?

ఏపీలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు వేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో పంచాయతీ ఎన్నికల పోరు పోలిటికల్ హీట్ పెంచేస్తుంది. జగన్ సర్కార్ ఎన్ని ఎత్తులు వేసినా.. చివరికి నిమ్మగడ్డ పంతం నెగ్గి పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెలలో పంచాయతీ ఎన్నికలు ముగియనున్నాయి.

mptc and zptc elections

ఈ క్రమంలో మరో ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది. మార్చి 31లోపు స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేసే దిశగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం దీనికి ఒప్పుకుంటుందో.. లేదో చూడాలి.