Panchayat Election: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఏపీలో పంచాయితీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత కొద్దిరోజుల క్రితం పంచాయతీ ఎన్నికలపై స్టే విధిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల సంఘం గత కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా నిబంధనలు సడలించిన క్రమంలో కార్యకలాపాలు సజావుగా సాగుతున్నందున పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని హైకోర్టు తెలిపింది. కాగా గత కొద్దిరోజుల క్రితం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వగా.. దీనిని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. అయితే ఎన్నికల నిర్వహణపై స్టే విధిస్తూ సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ డివిజనల్ బెంచ్‌ను నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆశ్రయించారు.