krishnam Raju:’రాధేశ్యామ్’ రిలీజ్ డేట్ చెప్పేసిన కృష్ణంరాజు

krishnam Raju: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ ఇంకా జరగాల్సి ఉంది. ఈ సినిమా కోసం డార్లింగ్ అభిమానులు వేచిచూస్తుండగా.. సినిమా గురించి ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టారు. ఏప్రిల్‌లో ఈ సినిమాను విడుదల చేసే అవకాశముందన్నారు.

krishnam raju about radhe shyam

తాను కూడా సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నానని, ఆ పాత్ర కోసం గడ్డం కూడా పెంచానన్నారు. షూటింగ్ త్వరలోనే జరుగుతుందన్నారు. ప్రభాస్, తన మధ్య కొన్ని సన్నివేశాలను తెరకెక్కించాల్సి ఉందని, పాటలు కూడా పూర్తి అయ్యాయని కృష్ణంరాజు(krishnam Raju) తెలిపారు. పొస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుందన్నారు.