Anushka: హైదరాబాద్‌లోని ఓ కార్యక్రమానికి హాజరైన అనుష్కశెట్టి ప్రతి మహిళ పోలీసులు ఒక స్టార్ అని అన్నారు. అనుష్క శెట్టి తన సినిమాలతో సినీ ప్రేక్షకుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. దర్శక దిగ్గజ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రంలో నటించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది అనుష్క శెట్టి. అలాగే అనుష్క రియల్‌లైఫ్‌లో కూడా పలు సామాజిక సేవలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది Anushka.
తాజాగా హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లోని జీఆర్సీ కన్వెన్షన్‌లో జరిగిన షీ పాహి కార్యక్రమానికి సైబర్‌బాద్ సీపీ సజ్జనార్‌తో పాటు Anushka అనుష్క శెట్టి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మూడు క్విక్ రెస్పాన్స్ వాహనాలు, షీ షటిల్ సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. మహిళల భద్రతకు పెద్దపీట వేశామని సీపీ సజ్జనార్ అన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా షీటీమ్స్ తరహా కార్యక్రమాలు చేపడుతున్నట్లు అని, ట్రాఫిక్, సైబర్ క్రైమ్ సహా అన్ని విభాగాల్లో మహిళలు పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. అదేవిధంగా సైబరాబాద్ కమిషనరేట్‌లో 12శాతం మంది మహిళ ఉద్యోగులు ఉన్నారని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన Anushka అనుష్కశెట్టి మాట్లాడుతూ.. ప్రతి మహిళా పోలీసు ఒక స్టార్ అని కొనియాడారుAnushka. కరోనా సమయంలో పోలీసులు చాలా కష్టపడ్డారని.. తెలంగాణలో ఇంతమంది మహిళా పోలీసులు ఉండడం సంతోషకరమని ఆమె అన్నారు. అలాగే మహిళల భద్రత కోసం క్విక్ రెస్పాన్స్ వాహనాలు, షీ షటిల్ సర్వీస్‌లను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని Anushkaఅనుష్క పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళ భద్రతా అదనపు డీజీ స్వాతిలక్రా, షీ టీమ్స్ డీసీపీ అనసూయ తదితరులు పాల్గొన్నారు.