నటిని పెళ్లాడనున్న డైరెక్టర్

తమిళ డైరెక్టర్ దేసింగ్ పెరియసామి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. నటి నిరంజని అగత్యాన్‌ను త్వరలో లవ్ మ్యారేజ్ చేసుకోనున్నాడు. ఫిబ్రవరి 25న పాండిచ్చేరిలో వీరి పెళ్లి జరగనుంది. ప్రస్తుతం బంధువులు, కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లో బిజీగా ఉన్నారు. తాజాగా దేసింగ్ పెరియస్వామి వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

periyaswamy marry niranjani

కన్నుమ్ కన్నుమ్ కొల్లైయాదిత్తల్ సినిమా ద్వారా డైరెక్టర్‌గా దేసింగ్ పెరియసామి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఈ సినిమాలో నిరంజని అగత్యాన్ కూడా నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో అగత్యాన్, దేసింగ్ పెరియసామి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఈ క్రమంలో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నారు.