బాలీవుడ్ లో మరో విషాదం.. సీనియర్ నటి కుంకుమ్ మృతి

బాలీవుడ్ లో మరో విషధ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో కొందరు ప్రముఖ నటులు అలాగే సీనియర్ టెక్నీషియన్స్ వరుసగా మరణించడం బాలీవుడ్ లో మునుపెన్నడు లేనంతగా విషాదాల్ని నింపింది. ఇక నేడు బాలీవుడ్ నటి కుంకుమ్ కన్నుమూశారు. దాదాపు 100కు పైగా చిత్రాల్లో ఆమె నటించారు. అసలు పేరు జైబున్నీసా. వయసు 86 సంవత్సరాలు.

మదర్ ఇండియా’, ‘ఆంఖే’, ‘నయా దౌర్’, ‘సపేరా ఏక్ లూటేరా’ తదితర సూపర్ హిట్ చిత్రాలతో కుంకుమ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బీహార్ లోని షేక్ పురా జిల్లాలోని హుస్సైనాబాద్ లో ఆమె జన్మించారు. గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న కుంకుమ్.. ముంబై బాంద్రాలోని తన నివాసంలో ఈ ఉదయం గం.11.30 లకు తుదిశ్వాస విడిచినట్లు ఆమె బంధువులు తెలియజేసారు. కుంకుమ్ మృతిపట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.