హీరోయిన్ నయనతార ఇటీవలే నెట్ఫ్లిక్ తో కలిసి ఒక డాక్యుమెంటరీ తీస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కొద్ది రోజుల క్రితం ఈ డాక్యుమెంటరీకి సంబంధించి తమిళ హీరో ధనుష్ 10 కోట్లకు దావా వేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఈ డాక్యుమెంటరీకి మరో సమస్య వచ్చి పడింది. చంద్రముఖి సినిమాలోని కొన్ని సీన్లు తమ పర్మిషన్ కి లేకుండా వాడుకున్నాడంటూ చంద్రముఖి చిత్ర నిర్మాతలు నయనతార, నేట్ఫ్లిక్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులలో వారికి నష్టపరిహారం చెల్లిస్తూ ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలని పేర్కొంది ఆ నిర్మాణ సంస్థ.