త్వరలోనే చిరంజీవి గారితో సినిమా ఉంది : అనిల్ రావిపూడి

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయకులకు నటిస్తూ ఎస్విసి నిర్మాణ సంస్థలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సంక్రాంతి సందర్భంగా వచ్చిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించగా ఈ చిత్ర యూనిట్ అంతా కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఓ సినిమా థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు.

ఈ సందర్భంగా అక్కడ జరిగిన ప్రెస్ మీట్ లో దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ… “మా చిత్రాన్ని ఇంతగా ఆదరించిన ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. సినిమా చూసిన వారందరూ ఎంతో పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. మళ్లీ మళ్లీ వచ్చి చూస్తున్నారు. అది మాకు చాలా ఆనందకరం. నేను వెంకటేష్ గారితో కలిసి సినిమా చేయడం ఇది మూడోసారి. మూడు సినిమాలు వరుసగా హిట్ కావడం మరో విశేషం. అయితే నేటితో ఎఫ్2 రికార్డును ఈ చిత్రం చేరుకుంది. మా సినిమాతో పాటు నాకు ఇష్టమైన హీరో బాలకృష్ణ గారి డాకు మహారాజ్ కూడా మంచి విజయం సాధించింది. అది నాకు చాలా ఆనందాన్నిచ్చింది. త్వరలోనే చిరంజీవి గారితో ఒక సినిమా ఉంది. ప్రస్తుతం స్టోరీ డిస్కషన్ లో ఉంది. త్వరలోనే ఆ చిత్రం గురించి అనౌన్స్ చేస్తాను” అన్నారు.

హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ… “సినిమాను ఆదరించిన ప్రేక్షకులందరికీ మా కృతజ్ఞతలు. సినిమా ఇంత విజయం సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు శ్రీవారిని దర్శించుకోవడమైంది” అన్నారు.

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ… “నేను నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాక ఈరోజు శ్రీవారిని కూడా జరిగింది” అన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ… “సినిమాను ఇంత పెద్ద హెల్ప్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. ఆరో రోజు కూడా సినిమా ఎంతో మంచి కలెక్షన్లు వసూలు చేస్తుంది. ఇప్పటికే ఎఫ్2 రికార్డును రీచ్ అయింది” అన్నారు.