BigB: అమితాబ్‌బచ్చన్ అంటే బాలీవుడ్ లెజండరీ అని చెబుతారు సిని ప్రేక్షకులు. బాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేసిన లెక్కలేనన్ని సినిమాలు అమితాబ్ లిస్ట్‌లో ఉన్నాయి. దేశం గర్వంచే నటుడు బిగ్‌బి. కానీ ఇదే అమితాబ్ ఒకప్పుడు రెండు రూపాయలు లేక ఇబ్బంది పడిన రోజులు జీవితాన్ని గడిపాడు. అటువంటి ఎన్నో కష్టాలను బిగ్‌బి తన జీవితంలో ఎదుర్కొన్నాడు. ఏదైనా కష్టతరమైన సమస్య ఎదురైతే.. దాన్ని తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు బిగ్‌బి.
ఇప్పుడు తాజాగా బిగ్‌బిలో సామాజిక సేవా అంశాలు ఎక్కువగా ఉంటాయని ఓ వార్తా నిరూపించింది. అదేంటంటే.. ఒకే జాబ్ చేసే దంపతులకు ఒకే దగ్గర ఉద్యోగం ఉండేలా అనేది ఇప్పుడు ఓ కలగా మారింది. తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన వివేక్ ఫర్మార్, మహారాష్ట్ర బోర్డర్‌లోని మంద్‌సౌర్‌లో ట్రాఫిక్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య కూడా ట్రాఫిక్ విభాగంలో కానిస్టేబులే. అయితే ఉద్యోగ బాధ్యతల కారణంగా మూడేళ్లుగా ఆ భార్యభర్తలు దూరంగా ఉంటూ వస్తున్నారు. కాగా ఇటీవలే కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో పాల్గొన్న వివేక్. ఈ విషయాన్ని అమితాబ్‌తో పంచుకున్నారు. దీంతో ఎంతో చలించిపోయారు అమితాబ్.. ఈ నేపథ్యంలో అదే వేదికపై మధ్య ప్రదేశ్ సర్కార్‌ను కోరారు. దీనిపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్పందించగా.. వివేక్ పనిచేస్తున్న మంద్‌సౌర్‌కు ఆయన భార్యను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.