10 భాషల్లో ‘పుష్ప’ రిలీజ్

అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పాన్ ఇండియా సినిమాకు దీనికి విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంటే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఈ సినిమాను ఏకంగా 10 భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

PUSHPA RELEASE IN 10 LANGUAGES

ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు ఆసక్తిని మరింత పెంచాయి. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇక దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు. ఇందులో విలన్ ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. విలన్ రోల్ కోసం పలువురు నటుల పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.