రొమాంటిక్ ఇంటెన్సిఫైడ్ డ్రామాగా అంబాజీపేట మ్యారేజి బ్యాండు ట్రైలర్ – ఫిబ్రవరి 2nd గ్రాండ్ గా విడుదల

సుహాస్ శివాని జంటగా దుష్యంత్ దర్శకత్వంలో ధీరజ్ మొగిలినేని గారు నిర్మాతగా జి ఏ 2 పిక్చర్స్ ధీరజ్ మొగిలేని ఎంటర్టైన్మెంట్స్ మహాయన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ నేడు విడుదలైంది. లవ్ రొమాన్స్ యాక్షన్ ఇంటెన్సిఫైడ్ ట్రైలర్ సినిమా పైన అంచనాలను పెంచేస్తోంది. సుహాస్ కి ఖాతాలో మరో విజయం ఖరారు అయినట్లే.

ఈ ట్రైలర్ ఈవెంట్ సందర్భంగా.
నిర్మాత ధీరజ్ మొగిలినేని గారు మాట్లాడుతూ : ఈ రోజున నేను నిర్మాతగా ఎలా ఉండడానికి గల కారణం ఆ గాడ్ ఫాదర్ అల్లు అరవింద్ గారు అలాగే బన్నీ వాసు గారు. ఈ సినిమాకి నాకు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. ఏదో నార్మల్ సినిమా తీయాలని ఇంట్రెస్ట్ ఎప్పుడు లేదు తీసే సినిమా ఖచ్చితంగా ఒక హిట్ కొట్టాలి బ్లాక్ బస్టర్ అవ్వాలి అనే ఇంట్రెస్ట్ తోనే సినిమా తీస్తున్నాను. ఈ సినిమాకి కంటెంట్ హీరో. హీరో సుహాస్ చాలా అద్భుతంగా నటించాడు హీరోయిన్ శివాని క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. శరణ్య గారు సినిమాలో చేసిన పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఫిబ్రవరి 2న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సినిమా చూసి ప్రేక్షకులు సక్సెస్ చేయాలని మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు.

దర్శకుడు దుష్యంత గారు మాట్లాడుతూ : ట్రైలర్ ఎంత బాగుందో సినిమా దీనికి డబల్ ఉంటుంది. ఈ సినిమాకి నాకు సపోర్ట్ చేసిన హీరో హీరోయిన్ అండ్ క్యారెక్టర్స్ మెయిన్ గా ప్రొడ్యూసర్ ధీరజ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఫిబ్రవరి 2nd న సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నాము మీ చేతుల్లో పెడుతున్నాము ఈ సినిమాని ఆదరించి మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

శరణ్య గారు మాట్లాడుతూ : నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దుష్యంత్ గారికి ప్రొడ్యూసర్ ధీరజ్ మిగిలిన గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. ఈ సినిమా చూసి ప్రేక్షకులు మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరోయిన్ శివాని గారు మాట్లాడుతూ : మీ ప్రేమ మీ ఆదరణ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ట్రైలర్ ఎంత అయితే బాగుందో సినిమా మీకు డబల్ ధమాకానిస్తుంది అని కచ్చితంగా ప్రామిస్ చేస్తున్నాను. ఎంత మంచి ట్రైలర్ కట్ చేసిన పవన్ గారికి థాంక్యూ సో మచ్. డైరెక్టర్ దుష్యంత్ గారు నన్ను ఈ క్యారెక్టర్ కి సెలెక్ట్ చేసినందుకు ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు. శేఖర్ చంద్ర గారు మ్యూజిక్ సూపర్ అండ్ ఇప్పుడు దాకా రిలీజ్ అయిన 2 సాంగ్స్ పెద్ద హిట్ అయ్యాయి. ఈ సినిమాని చూసి మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో సుహాస్ గారు మాట్లాడుతూ : నార్మల్ గా వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ పెరుగుతారు అంటారు ఈ సినిమా గురించి వెయిట్ చేసి వెయిట్ చేసి సినిమా వెయిట్ పెంచాము. పబ్లిక్ రెస్పాన్స్ ఇలా ట్రైలర్ కు రావడం చాలా ఆనందంగా ఉంది. సినిమా ఇంతకు మించి ఉండబోతోంది. మీ ఆదరణ సపోర్ట్ ఎప్పుడూ మా పై ఇలాగే ఉండాలని ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.