కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకుని, ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో మన ముందుకి వచ్చారు సుహాస్. ఈ సినిమాకి ప్రొమోషన్స్ చేసే ప్రక్రియలో ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో సుహాస్, హీరోయిన్ శివాని ఇంకా ఆ సినిమాలో కరెక్ట్ విల్లన్ చేసిన నితిన్ ప్రసన్న ఉండగా యాంకర్ అడిగిన రాపిడ్ ప్రశ్నకి ఆశ్చర్య పరిచే సమాధానాలు చెప్పారు. సుహాస్ గారు తన ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత, ఆ డబ్బులు ఏం చేశారు అని ప్రశ్నించగా హీరో సుహాస్ తన ఫస్ట్ రెమ్యూనరేషన్ రవితేజ గారు వెనక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఓ కానిస్టేబుల్ గా పనిచేసినట్లు, దానికి గాను సుహాస్ గారికి 1000 రూపాయలు వచ్చినట్లు చెప్పారు. అయితే 1000 రూపాయలు తో క్వాటర్ రాయల్ స్టాగ్ మందు, బిర్యానీ ప్యాకెట్ తీసుకున్నట్లు సమాధానం ఇచ్చారు. రెండు మూడు రోజులు అలాగే చేసినట్లు చెప్పారు. అది విన్న యాంకర్ చిన్నపాటి ఆశ్చర్యానికి గురైన, నవ్వుతూ నిజాయితీగా సమాధానం బాగా చెప్పారు అని సుహాస్ ని మెచ్చుకున్నారు. దానికి సమాధానం పోని అబద్ధం చెప్పమంటారా, వెయ్యి రూపాయల్లో వంద రూపాయలు పెట్టి అరటిపండ్లు కొనుకున్నాను, మిగతావి ఇంటికి పంపాను అని చెప్పమంటారా అని నవ్వుతూ సమాధానం చెప్పారు.