నిహారిక అతనితో నటించనుందా?

నిహారిక కొణిదల ఒక మనసు సినిమా తొలి చిత్రంగా హీరోయిన్గా నాగ శౌర్యతో జంటగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తర్వాత ఆవిడ యూట్యూబ్ కి పరిమితంగా ఉంటూ నటిస్తూ ఉన్నప్పటికీ తర్వాత ప్రొడ్యూసర్ గా మారింది. ఆ తర్వాత తమిళ్ సినిమాలో అడుగు పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టబోతుంది.
నిహారిక ఇటీవల నటనకు బ్రేక్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత డెడ్ పిక్సెల్స్ లాంటి వెబ్ సిరీస్ లో నటించడం జరిగింది. తెలుగులో వస్తున్న మరో ఒక వెబ్ సిరీస్ కి తాను ప్రొడ్యూసర్ గా చేస్తూనే ఓ తమిళ సినిమాలో హీరోయిన్ గా రాబోతుంది.

Shane Nigam


అయితే మద్రాస్కరణ్ అనే ఓ తమిళ సినిమాలో షేన్ నిగం తో జంటగా నటించనుంది. ఎస్ ఆర్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సినిమా గురించి మరికొన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
వెండి తెరపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని నిహారిక ఎంతగానో శ్రమిస్తున్నారు. అయితే వాట్ ది ఫిష్ అనే ఒక తెలుగు సినిమాలో ఆవిడ నటిస్తున్న విషయం తెలిసిందే.