మలయాళం సినిమాలతో తనదైన శైలిలో క్రేజ్ అందుకున్న బ్యూటీ అమలా పాల్. అటు తమిళ్ లో కూడా అవకాశాలు బాగానే అందుకుంటోంది. వివాహం తర్వాత కొంత విరామం తీసుకున్నప్పటికీ, విడాకులతో నటి మళ్లీ చురుకుగా మారింది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉన్న ఈ నటి, దుస్తుల పేరిట తరచుగా కొన్ని అసభ్యకరమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
కొడైకెనాల్లో తీసిన కొన్ని అందమైన ఫొటోలను ఈ నటి తన సోషల్ మీడియా ఎకౌంట్ లో షేర్ చేసుకుంది. అయితే ఒక గ్లామర్ ఫోటోపై కొంతమంది నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్ చేయగా ఒక నెటిజన్ మాత్రం అసభ్యకరమైన వ్యాఖ్యలతో హీరోయిన్ కి ఆగ్రహం తెప్పించాడు. అయితే ఆమె మాత్రం చాలా కూల్ గా కౌంటర్ ఇచ్చింది. ఇంకా ఎక్కడ ఉన్నావ్.. మేము 2020లోకి వచ్చేశాం.. ఏదైనా సరే క్యాచ్ చేసేలా ఉండాలని అమ్మడు మరో అర్థం వచ్చేలా కౌంటర్ ఇచ్చింది. దీంతో ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.