మెగా హీరోల బాటలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు..

మళయాళం సినిమాలకు ఈ మధ్య కాలంలో మంచి క్రేజ్ అందుతోంది. ముఖ్యంగా తెలుగులో బడా హీరోలు అక్కడి కథలపై బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు అర్ధమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి లూసీఫ‌ర్ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇక మ‌రో సినిమా అయ్య‌ప్పన్ కోషియ‌మ్ కథలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించ‌నున్నారు.

ఇక త్వరలో క‌ప్పెలా అనే మరో కథను కూడా తెలుగులో రీమేక్ చేయ‌నున్నారు. ఇక లేటెస్ట్ గా క‌లెక్ష‌న్ కింగ్ మోహన్ బాబు కూడా గత కొన్ని రోజులుగా ఒక మలయాళ చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. అదే ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25. సూరజ్ వెంజరామూద్, సౌబిన్ సాహిర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సైన్టిఫిక్ కామెడీ సినిమాను మూడు రాష్ట్ర స్థాయి అవార్డులను సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రాన్ని ఎలాగైనా తెలుగులో రీమేక్ చేయాలని మోహన్ బాబు ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. మ‌రి ఈ సినిమాని ఎవ‌రు డైరెక్ట్ చేస్తారో చూడాలి.