రష్మికకు షాకిచ్చిన అప్‌క‌మింగ్ హీరోయిన్

తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్‌గా తెచ్చుకున్న రష్మిక మందన్నా.. ఇటీవల బాలీవుడ్‌లో కూడా ఒక సినిమా అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో ఒక గిరిజన యువతి పాత్రలో రష్మిక నటిస్తోంది. అయితే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన రష్మికకు ఇప్పుడు ఒక అప్‌కమింగ్ హీరోయిన్ షాకిచ్చింది.

rashmika mandanna

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో పాండిరాజ్ ఒక సినిమా తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో ముందుగా హీరోయిన్‌గా రష్మికను అనుకున్నారు. కానీ రష్మిక హై రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో.. ఆమె స్థానంలో అరుల్ మోహన్‌ని తీసుకున్నారు. అరుల్ మోహన్ తెలుగులో నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించింది. ఇక శర్వానంద్ హీరోగా వస్తున్న శ్రీకారం సినిమాలోనూ నటిస్తోంది. ఇక తమిళంలో శివ కార్తికేయన్ హీరోగా వస్తున్న సినిమాలోనూ నటిస్తోంది.