maheshbabu: జిమ్‌లో క‌ష్ట‌ప‌డుతున్న‌ మ‌హేశ్‌.. సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌!

maheshbabu: వరుస విజ‌యాల‌తో ఊపుమీదున్న సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు తాజాగా జిమ్‌లో ఎక్స‌ర్‌సైజ్ చేస్తూ.. ఆ వీడియోను త‌న ఇన్‌స్ట్రాగ్రామ్‌లో అభిమానుల‌తో పంచుకున్నారు. మ‌హేశ్ చివ‌రి చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రుతో విజ‌యం అందుకున్న ఆయ‌న ఆ త‌ర్వాత గీత గోవిందం దర్శ‌కుడు ప‌రుశురాం డైరెక్ష‌న్‌లో స‌ర్కార్ వారి పాట‌లో మ‌హేశ్ న‌టిస్తున్నారు. ఈ సినిమా కోసం ఎంతో ఆహార్నిశ‌లు కృషి చేస్తున్నాడు. మంచి లుక్ కోసం, ఆయ‌న హెయిర్‌స్టైల్‌తో పాటు కండ‌లు పెంచాల‌నుకుంటున్నాడు.

mahesh zim

అందుకే ఈ నేప‌థ్యంలో బాక్స్ జంప్స్ చేస్తూ జిమ్‌లో వ్యాయ‌మం చేస్తున్నారు maheshbabu మ‌హేశ్‌. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారి.. ఆయ‌న ఫిట్‌నెస్ ర‌హ‌స్యం ఇదేనంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక స‌ర్కార్ వారి పాట చిత్రంలో మ‌హేశ్ స‌ర‌స‌న తొలిసారి కీర్తి సురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఏకే ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, ఎంబీ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి దేవిశ్రీ‌ప్ర‌సాద్ స్వ‌రాలు స‌మ‌కురుస్తున్నారు.