అల్లు శిరీష్ `ABCD` సెన్సార్ పూర్తి.. మే 17న విడుద‌ల

యువ కథానాయకుడు అల్లు శిరీష్‌ హీరోగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి.సురేష్‌ బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ పతాకాలపై రూపొందుతోన్న ఎంటర్‌టైనర్‌ ‘ఏబీసీడీ’. ‘అమెరిక్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశి’ ట్యాగ్‌ లైన్‌. సంజీవ్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతోన్న ఈ సినిమాను మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని నిర్మిస్తున్నారు. ఈ సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సినిమాకు క్లీన్ యు స‌ర్టిఫికేట్ వ‌చ్చింది. సినిమాను మే 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్ చేస్తున్నారు.

abcd movie

ఇటీవ‌ల విడుద‌లై టీజ‌ర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక యంగ్ సింగ‌ర్ సిద్ శ్రీరామ్ పాడిన మెల్ల‌మెల్ల‌గా .. సాంగ్ అన్నీ ఫ్లాట్‌ఫామ్స్‌లో 25 మిలియ‌న్ వ్యూస్‌ను రాబ‌ట్ట‌కుని సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో అమెరికా నుండి ఇండియా వ‌చ్చిన ఎన్నారై పాత్ర‌లో అల్లు శిరీష్‌, అత‌ని స్నేహితుడి భ‌ర‌త్ న‌ట‌న సినిమా ఆసాంతం మెప్పించ‌నుంది.