సంధ్య థియేటర్ సంఘటన పై అల్లు అర్జున్ స్పందన

అల్లు అర్జున్ హీరోగా నటిస్తూ డిసెంబర్ 5వ “పుష్ప 2 : ది రూల్” ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అయితే డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం నుండి ఈ సినిమాను పలు థియేటర్లలో ప్రీమియర్ షోలు వేయడం మొదలుపెట్టారు. అదే తరహాలో హైదరాబాదులోని సంధ్యా థియేటర్లో కూడా ప్రీమియర్ షో వేయడం జరిగింది. కాగా ఆ షోకు అల్లు అర్జున్ గా వెళ్ళారు. ఆ సమయంలో ప్రేక్షకులు ఎక్కువగా ఉండటంతో తొక్కిసలాడ జరిగింది. ఆ ఘటనలో ఓ మహిళ మరణించగా తన కుమారుడు గాయపడటం జరిగింది. ఇంతవరకు అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ఈ ఘటనపై అల్లు అర్జున్ స్పందిస్తూ… “నేను సినిమా చూసేందుకు సంధ్య థియేటర్ కి వెళ్లాను. అయితే సినిమా చూసి వచ్చిన తర్వాత రేవతి అనే ఓ మహిళ చనిపోయారని అలాగే తమ బాబుకు సీరియస్ గా ఉందని తెలిసింది. ఆ విషయం తెలిసిన నేను, చిత్ర దర్శకుడు సుకుమార్, అలాగే చింతపండు అంతా చాలా బాధపడ్డాము. రేవతి గారి కుటుంబానికి మా సంతాపం తెలియజేస్తున్నాను. కానీ మేము ఏం చేసినా ఆ కుటుంబానికి జరిగిన నష్టం కానీ, లోటు భర్తీ చేయడం గాని చేయలేము. కానీ ఖచ్చితంగా ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాము. 25 లక్షలు వారి భవిష్యత్తు కోసం ఇస్తున్నాను. ఈ డబ్బుకు సంబంధం లేకుండా తమ పూర్తి మెడికల్ ఖర్చులు నిలబడిస్తాను. ఆ కుటుంబ బాధ్యత నాది. మేము సినిమాలు తీసేది ప్రేక్షకులను సంతోషం పెట్టాలని. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు అంతా సేఫ్గా ఇంటికి వెళ్ళండి” అన్నారు.