సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డిసెంబర్ 5వ తేదిన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పుష్ప 2. ఇప్పటికే అంచనాలకు మించి తారా స్థాయిలో ఈ చిత్రం సినీ వర్గాలను ఆశ్చర్య పరుస్తుండగా ఇప్పుడు మరికొన్ని రికార్డ్స్ కొత్తగా సృష్టిస్తూ వస్తుంది. 22 రోజుల్లో 1719.5 కోట్ల రూపాయలు వసూళ్లు చేసి దేశంలోనే కొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటికీ ఉన్న అని రికార్డ్స్ బ్రేక్ చేస్తూ దంగల్ రికార్డు బ్రేక్ చేసే దిశగా పుష్ప 2 తాండవం చేస్తూ ప్రేక్షకుల మన్నన పొందుతుంది. దేశం అంతా ఈ చిత్రాన్ని ఒక జాతరగా జరుపుతుండగా ఇటువంటి కొత్త రికార్డ్స్ ఈ చిత్ర ఖాతాలో చేరుతూ వస్తున్నాయి. అదే విధంగా ఈ సినిమా నుండి మార్కెట్లోకి వస్తున్న ఒకొక విడియో సాంగ్ సినిమాకు మరింత క్రేజ్ పెంచుతూ ప్రేక్షకులను మరింతగా థియేటర్లకు వచ్చే దిశగా ప్రమోట్ చేయడంలో మరో ప్లస్ గా అయ్యాయి.