ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. అల్లు అర్జున్ వెంట తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ ఛైర్మన్ దిల్ రాజు ఉన్నారు. ఇద్దరూ కలసి కిమ్స్ ఆసుపత్రిలోకి వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించారు.బాలుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
శ్రీతేజ్ తండ్రితో అల్లు అర్జున్ ప్రత్యేకంగా మాట్లాడారు. కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.