1000కోట్ల వసూళ్ల చరిత్రను తిరగరాసిన అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ట్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పుష్ప 2. ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన ఈ సినిమా కలెక్షన్స్ ఇప్పుడు మరొక పెద్ద రికార్డు సృష్టించింది. 6 రోజుల్లోనే 1000 కోట్ల రూపాయలు వసూళ్లు చేసి మరొక మార్క్ సృష్టించింది. బాహుబలి 2 ఈ రికార్డుకు 10 రోజుల సమయం పట్టగా, ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ చిత్రాలకు 16 రోజులు పట్టింది. కల్కి చిత్రం 17 రోజులకు 1000 కోట్లు ఖర్చు చేయగా జవాన్ 18 రోజుల్లో, అలాగే పటాన్ 27 రోజుల్లో వసూలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఉన్న ఈ రికార్డులు అన్నింటిని బ్రేక్ చేస్తూ అల్లు అర్జున్ కేవలం ఆరు రోజుల్లోనే 1000 కోట్లు వసూలు చేయడంతో సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఇది ఇలా ఉండగా సినిమాకు ఏ మాత్రం ఆదరణ తగ్గకుండా కలెక్షన్లు వర్షం ఇంకా కురుస్తూనే ఉండటంతో సినిమా ఎంత ఉన్నత స్థాయికి వెళ్లబోతుందో అనేది ఎవరి అంచనాకి అందకుండా ఉంది.