ప్రస్తుతం అల్లుఅర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప చిత్రంలో నటిస్తున్నారని విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో పుష్ప షూటింగ్ జరుగుతుంది. కొన్ని రోజులుగా పుష్ప యూనిట్ అక్కడే షూటింగ్ జరుపుతున్నా బన్నీ మాత్రం ఉదయం వచ్చి సాయంత్రం సైలెంట్‌గా వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా షూటింగ్ ముగించుకుని రంపచోడవరం నుంచి పందిరి మామిడి మీదుగా కోట గ్రామానికి వెళ్తున్న సమయంలో..
అల్లుఅర్జున్‌కు తాళ్లపాలెం గిరిజనులు ఊహించని విధంగా స్వాగతం పలికారు. బన్నీపై పూలవర్షం కురిపించారు. వాహనం పైకి వచ్చి వారితో మాట్లాడారు. సెల్ఫీలు కూడా దిగారు. వారి అభిమానానికి ఫిదా అయిన అల్లుఅర్జున్.. వారికి అభివాదం చేస్తూ వెళ్లాడు. ఇదిలాఉంటే.. ఈ సినిమాలో అల్లుఅర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక పుష్ప చిత్రం ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో పుష్పరాజ్ పాత్రలో బన్నీ కనిపించనున్నాడు. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.