ఆ సీక్రెట్ జోసెఫ్‌కి మాత్రమే తెలుసన్న నిహారిక

ఇటీవలే పెళ్లి చేసుకున్న మెగా డాటర్ నిహారిక.. ఇప్పుడు సినిమాలపై దృష్టి పెట్టింది. ఇటీవలే ఒక వెబ్‌సిరీస్‌ను స్టార్ట్ చేసింది. త్వరలోనే దీని షూటింగ్ ప్రారంభం కానుండగా.. ఇందులో యాంకర్ అనసూయ కూడా నటించనుదని తెలుస్తోంది. కీరవాణి సోదరుడు కల్యాణ్ మాలిక్ దీనికి సంగీతం అందించనున్నాడు.

NIHARIKA INSTRAGRAM POST SECRET

అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నిహారిక.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. ఈ సందర్భంగా ‘నాకు ఓ రహస్యం తెలుసు. కానీ అది మీతో చెబితే రహస్యం ఎలా అవుతుంది? నేను దాచిపెడుతున్న ఆ రహస్యమేంటో ఒక్క జోసెఫ్ రాధిక్‌కు మాత్రమే తెలుసు’ అంటూ కామెంట్ పెట్టింది. ఇంతకు ఆ జోసెఫ్ రాధిక్ ఎవరో తెలుసా. నిహారిక పెళ్లికి ఫోటోలు తీసిన ఫోటోగ్రాఫర్ అని తెలుస్తోంది. మరి సీక్రెట్ ఏంటో త్వరలోనైనా నిహారిక బయటపడుతుందేమో చూడాలి.