నిజమో అబద్ధమే తెలియదు గాని ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో ఒక టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది. అల్లు అర్జున్ పొలిటిక్ లీడర్ గా కనిపించబోతున్నాడని త్వరలో ఆంద్రప్రదేశ్ రాజకీయాలను టచ్ చేయబోతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఏకంగా ఆయన ఆంద్రప్రదేశ్ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి బయోపిక్ చేస్తున్నట్లు కథనాలు వస్తుండడంతో జనాలు ఓ విధంగా షాక్ అవుతున్నారు.
ఇది ఎంతవరకు నిజం అనే విషయాన్ని పక్కనపెడితే యాత్ర దర్శకుడు మహి వి రాఘవ నెక్స్ట్ అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఆంద్రప్రదేశ్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని కథను రాసిన ఆ దర్శకుడు జగన్ రియల్ లైఫ్ ఆధారంగా హీరో పాత్రను డిజైన్ చేసినట్లు టాక్ వస్తోంది. దీంతో అల్లు అర్జున్ జగన్ బయోపిక్ లో నటిస్తున్నాడు అనే పుకార్లు మీడియా ఛానెల్స్ లో జోరుగా వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.