టాలీవుడ్ హీరో నితిన్ పెళ్లి డేట్

టాలీవుడ్ యువ హీరో నితిన్ మొత్తానికి పెళ్లి డేట్ ని ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సమ్మర్ లోనే దుబాయ్ లో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్న నితిన్ కరోనా వైరస్ కారణంగా ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక కరోనా వైరస్ అదుపులోకి వచ్చిన తరువాత మళ్ళీ ప్లాన్ చేసుకోవాలని అనుకున్నారు.

కానీ రోజురోజుకి కరోనా మరింత పెరుగుతుండటంతో నితిన్ మొన్నటివరకు కన్ఫ్యూజన్ లోనే ఉన్నాడు. ఇక మొత్తానికి పర్ఫెక్ట్ ప్లాన్ తో హైదరాబాద్ లోనే ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. జులై 26వ తేదిన రాత్రి 8.30నిమిషాలకు నితిన్, షాలినిల వివాహానికి ముహూర్తం ఖరారైంది. కేవలం అతికొద్ది మంది అతిధుల సమక్షంలో పెళ్లి వేడుకను సింపుల్ గా జాగ్రత్తగా నిర్వహించుకోవలని నితిన్ ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.