పాన్ ఇండియా స్థాయి నుండి హాలీవుడ్ స్థాయికి అల్లు అర్జున్

పుష్ప చిత్రం తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేయబోతున్న సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా తన తర్వాత చిత్రమైన #AA22 నుండి ఒక అప్డేట్ విడుదల కావడం జరిగింది. సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ నుండి అల్లు అర్జున్ హీరోగా విజయవంత దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతున్నట్లు మేకర్స్ ఒక్క వీడియో విడుదల చేశారు. ఈ చిత్రం దర్శకుడు అట్లీ కి 6వ చిత్రం అలాగే అల్లు అర్జున్ కు 22వ చిత్రం. ఈ వీడియో విషయానికి వస్తే సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో ఇక్కడే అర్థమవుతుంది. ఇండియా నుండి అమెరికాకు వెళ్లిన అల్లు అర్జున్, అట్లీ అక్కడ ఎవరెవరిని కలిసారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎన్నో పెద్ద పెద్ద హాలీవుడ్ చిత్రాలకు టెక్నీషియన్లుగా పనిచేసిన వారిని వీరిద్దరూ కలవడం జరిగింది. అంతేకాక స్క్రిప్ట్ ఎలా ఉంది అని అల్లు అర్జున్ వారిని అడగగా వారంతా ఎటువంటి స్క్రిప్టు గతంలో ఎన్నడు వినలేదని, ఈ చిత్రం ఎంతో భారీగా ఉండబోతుందని, ఎంత కష్టమైనా తాము ఈ చిత్రానికి పనిచేసే తీరుతామని ఎంత కాన్ఫిడెంట్గా సమాధానం ఇవ్వడం జరిగింది. అంతేకాక అల్లు అర్జున్ ముఖ చిత్రం అలాగే అల్లు అర్జున్ ఎక్స్ప్రెషన్స్ను తీసుకున్నారు. భారీ బడ్జెట్ తో ప్రపంచ స్థాయిలో రాబోతున్నాయి చిత్రం గురించి తెలియాలంటే వేచి చూడాల్సిందే.