సినిమా కోసం ఆయన పడే కష్టం చాలా గొప్పది…

స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారుతున్న అల్లు అర్జున్ తన మార్కెట్ ను పాన్ ఇండియా లెవెల్లో సెట్ చేసుకుంటాడా లేదా అనేది పుష్పతోనే ఒక క్లారిటీ వస్తుంది. ఆ తరువాత ఎన్ని సినిమాలను లైన్ లో పెట్టినా కూడా పుష్ప క్లిక్కయితేనే ఒక రూట్ సెట్టవుతుంది. సినిమా కోసం అయితే బన్నీ చాలా కష్టపడుతున్నాడు. మధ్యలో లాక్ డౌన్ పడినా ఎక్కువ గంటలు వర్క్ చేసి మరి ఫస్ట్ పార్ట్ ను పూర్తి చేశాడు. దర్శకుడు సుకుమార్ కూడా మొదటిసారి డైరెక్ట్ చేస్తున్న పాన్ ఇండియా సినిమా కావడంతో అంచనాలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. సినిమాలో బన్నీ పుష్ప రాజ్ పాత్రలో ఒక లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఇక సినిమా కోసం బన్నీ పడే కష్టం గురించి ఇటీవల రష్మిక. మందన్న క్లారిటీ ఇచ్చేసింది. ఇన్స్టాగ్రామ్ లో లైవ్ చాట్ లో మాట్లాడిన ఈ బ్యూటీ అనేక విషయాలపై సమాధానాలు చెప్పింది.

ముఖ్యంగా అల్లు అర్జున్ పాత్ర సినిమాలో నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందని చెబుతూ అతను ప్రొఫెషినల్ గా అద్భుతమైన నటుడని అలాంటి యాక్టర్ తో కలిసి వర్క్ చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చినట్లు చెప్పారు. అంతే కాకుండా అల్లు అర్జున్ తెలివైన డ్యాన్సర్ అని అతనితో వర్క్ చేయడానికి కూడా ఇష్టంగా ఉంటుందని మరోసారి వివరణ ఇచ్చింది. ఇక రష్మిక పుష్ప సినిమాతో పాటు శర్వానంద్ తో ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా కూడా చేస్తోంది. అంతే కాకుండా మిషన్ మజ్ను, గుడ్ బై అనే హిందీ సినిమాల్లో కూడా నటిస్తోంది.