‘ఆయ్’ టీంకు అల్లు అర్జున్ ఆల్ ద బెస్ట్

పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ తన పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికీ టాలీవుడ్ విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటున్నారు. GA2 ప్రొడక్షన్స్ లో బన్నీ వాస్, విద్య కొప్పినీడి నిర్మాతలుగా అంజిబాబు దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఆయ్. నార్నె నితిన్ ఈ సినిమాలో హీరోగా చేస్తున్నారు. అయితే ఎంతటి పాన్ ఇండియా హీరోయిన్ అప్పటికి ఆయ్ లాంటి ఒక చిన్న సినిమాను అల్లు అర్జున్ ప్రోత్సహించడం. అలాగే బన్నీ వాస్, విద్య కొప్పినీడి తనకు చాలా దగ్గర మనుషులు. దానితో అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికైనటువంటి X ద్వారా వీరిద్దరికి అలాగే సినిమా టీంకు తన బెస్ట్ విషెస్ తెలిపారు. తమ గీతా ఆర్ట్స్ లో వీరు భాగం కావడం అలాగే తన మనసుకు చాలా దగ్గర వారు కావడం విశేషం.