అల్లు అర్జున్ పిల్లలకు సోషల్ మీడియాలో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అల్లు అయాన్ కంటే ఎక్కువగా అల్లు అర్హ సోషల్ మీడియాలో నెటీజన్స్ ని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక నేడు రక్షా బంధన్ సందర్భంగా ఇద్దరు కూడా మళ్ళీ సోషల్ మీడియాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.
అల్లు అర్హ తన అన్నయ్య అయాన్ కి రాఖీ కడుతున్న ఫోటో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ షేర్ చేశారు. దీంతో నిమిషాల్లోనే ఆ ఫొటోలు వైరల్ గా మారాయి. క్యూట్ గా అర్హ తన అన్నయ్యకి బొట్టు పెడుతూ ఆ తరువాత రాఖీ కట్టింది. అనంతరం అయాన్ తన గారాల చెల్లికి బేబి డాల్ బొమ్మను బహుమతిగా ఇచ్చాడు. ఇద్దరిని ఈ విధంగా చూసిన అభిమానులు కూడా తెగ సంబరపడిపోతూ ఫోటోలను మరింత వైరల్ అయ్యేలా చేస్తున్నారు.