అల్లరి నరేష్ కొత్త సినిమా టైటిల్ గా ’12A రైల్వే కాలనీ’ – దర్శకుడు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

అల్లరి నరేష్ బోల్డ్ అండ్ యూనిక్ ప్రాజెక్ట్స్ తో అలరిస్తున్నారు. తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ మరొక ఎక్సయిటింగ్ డిఫరెంట్ మూవీ అవుతుందని హామీ ఇస్తుంది. పొలిమేర, పొలిమేర 2 చిత్రాలతో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్, ఈ ప్రతిష్టాత్మక వెంచర్‌కు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు షోరన్నర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ నాని కాసరగడ్డ దర్శకత్వంతో పాటు ఎడిటింగ్ ని నిర్వహిస్తారు.

ఈరోజుఈ సినిమా టైటిల్‌ను ఒక స్పైన్ చిల్లింగ్ టీజర్ ద్వారా రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి 12A రైల్వే కాలనీ అని ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టారు, టీజర్ సినిమా కథను గ్లింప్స్ లా ప్రజెంట్ చేసింది. అల్లరి నరేష్ ఒక కిటికీ దగ్గర నిలబడి, ఆలోచనలో, ధ్యాన ముద్రలో కనిపించడంతో టీజర్ బిగెన్ అవుంతుంది. వైవా హర్ష వాయిస్ ఓవర్‌లో కొంతమందికి మాత్రమే ఆత్మలు ఎందుకు కనిపిస్తాయో, రాబోయే అతీంద్రియ అంశాలను ఎందుకు సూచిస్తుందో ప్రశ్నిస్తుంది.

టీజర్ వింతైన, కలవరపెట్టే సంఘటనలు ఎక్సయిటింగ్ గా వున్నాయి, ప్రతి పాత్ర కూడా అనుమానాస్పదంగా వుంది. అల్లరి నరేష్ పాత్ర ఒకరిని షూట్ చేసి నవ్వడం ప్రేక్షకులను ఆ పాత్ర గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగించేలా వుంది. 

అల్లరి నరేష్ డిఫరెంట్ షేడ్స్‌తో మరో ఆసక్తికరమైన పాత్రను పోషించగా, పోలిమేరా సిరీస్ ఫేమ్ డాక్టర్ కామాక్షి భాస్కర్ల కథానాయికగా నటించారు. సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనిష్ కురువిల్లా మధుమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

సినిమాటోగ్రాఫర్ కుశేందర్ రమేష్ రెడ్డి, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో క్యాలిటీ వర్క్ టైటిల్ టీజర్‌లో స్ట్రాంగ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాయి. 

ఈ సమ్మర్ లో సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.

తారాగణం: అల్లరి నరేష్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల, సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనిష్ కురువిల్లా, మధుమణి  

సాంకేతిక సిబ్బంది:

బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్

నిర్మాత: శ్రీనివాస చిట్టూరి

సమర్పణ పవన్ కుమార్

కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ & షోరన్నర్: డాక్టర్ అనిల్ విశ్వనాథ్

ఎడిటర్ & డైరెక్టర్: నాని కాసరగడ్డ

డిఓపి: కుశేందర్ రమేష్ రెడ్డి

సంగీతం: భీమ్స్ సిసిరోలియో

VFX: త్రివేణి కాసరగడ్డ (నియో స్టూడియోస్)

సౌండ్ డిజైన్: రఘునాథ్

DI: అన్నపూర్ణ స్టూడియోస్

కలరిస్ట్ : రఘు తమ్మారెడ్డి

సౌండ్ మిక్స్ ఇంజనీర్: కృష్ణ రాజ్ ఆర్ముగం

పీఆర్వో: వంశీ శేఖర్

మార్కెటింగ్: విష్ణు తేజ్ పుట్ట