ఎఫ్ 3 స్క్రిప్ట్ పై వెంకటేష్ ఇంకా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ దర్శకుడు అనిల్ రవిపుడి ఆ చిత్రానికి సంబంధించిన పనులను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటు జాగ్రత్తలు తీసుకుంటే పనులను హ్యాపీగా పూర్తి చేసుకోవచ్చని కొందరు షూటింగ్స్ మొదలుపెడుతున్నారు. అనిల్ రవిపుడి కూడా వెంటనే ఏదైనా సినిమాతో బిజీ కావాలని చూస్తున్నాడు.
వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మరియు మెహ్రీన్ నటించిన “ఎఫ్ 2” కి కొనసాగింపుగా “ఎఫ్ 3” సినిమాను స్టార్ట్ చేయనున్నట్లు ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చారు. 2021 జనవరి నుంచి ఈ చిత్రాన్ని సెట్స్‌కు తీసుకెళ్లాలని దర్శకుడు ప్లాన్ చేసుకున్నాడు. ఆ సమయానికి వెంకీ, వరుణ్ తేజ్ తమ ప్రస్తుత ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. ఇప్పటికే అనిల్ ప్రీ-ప్రొడక్షన్ పనులను ప్రారంభించిందనట్లు సమాచారం. కేవలం ఐదు నెలల్లోనే పూర్తి చేసి 2021 వేసవి చివరలో ఆ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు.