సుశాంత్ తో డేటింగ్.. ఆ నిజాన్ని ఒప్పుకున్న సారా అలీ ఖాన్

Sushant Singh Rajput and Sara Ali Khan were in love

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి సంబంధించిన అనేక రకాల కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్ మీడియాలో సారా అలీ ఖాన్ గురించి మరొక ఆసక్తికరమైన విషయం హాట్ టాపిక్ గా మారింది. ఆమె సుశాంత్ సింగ్ తో డేటింగ్ లో చేసినట్లు ఎన్సీబి విచారణలో ఒప్పుకుందని కథనాలు వెలువడుతున్నాయి.

సారా అలీ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కలిసి నటించిన చిత్రం కేదార్ నాథ్. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వారిద్దరు చాలా క్లోజ్ అయ్యారట. స్పెషల్ గా థాయిల్యాండ్ టూర్ కి కూడా వెళ్లినట్లు రూమర్స్ వచ్చాయి. అదికూడా నిజమని ఒప్పుకున్న సారా సుశాంత్ రిలేషన్ షిప్ లో నిజాయితీగా లేనందుకే బ్రేకప్ చెప్పినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఎన్సీబి విచారణలో మాత్రం సారా డ్రగ్స్ తీసుకోలేదని తనకు కేవలం ఒక సిగరెట్ అలవాటు తప్పితే మరొకటి లేదని కూడా వివరణ ఇచ్చిందట. కానీ సుశాంత్ కి మాత్రం డ్రగ్స్ అలవాటు ఉందని చాలా క్లియర్ గా చెప్పినట్లు తెలుస్తోంది. సారా అలీ ఖాన్ తో పాటు రకుల్, దీపికా, శ్రద్దా ఇటీవల ఎన్సీబి విచారణలో పాల్గొన్న విషయం తెలిసిందే.