అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన RRR హీరోయిన్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ అస్వస్థతతో ఆస్పత్రిలో చేరడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న గంగూబాయి కతియావాడి సినిమా షూటింగ్‌లో ఆమె పాల్గొంటోంది. అయితే ఈ షూటింగ్ సందర్భంగా ఆలియాభట్ అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందిన అనంతరం తిరిగి ఇంటికి చేరుకుంది.

ALIABHUTT IN HOSPITAL

ఎక్కువగా అలసిపోవడం వల్లనే ఇలా జరిగిందని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. కోలుకున్న తర్వాత తిరిగి సోమవారం ఆమె షూటింగ్‌లో పాల్గొన్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘గంగూబాయి కతియావాడి’ సినిమాతో పాటు ‘బ్రహ్మాస్త్ర’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి బిగ్ ప్రాజెక్ట్‌లతో ఆలియా నటిస్తోంది.