‘అలనాటి రామచంద్రుడు’ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది టీజర్ లాంచ్ ఈవెంట్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ కృష్ణ వంశీ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త ప్రేమకథా చిత్రం  ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స బ్యానర్ పై  హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. మోక్ష హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు టీజర్ ని లాంచ్ చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిధిగా హాజరైన టీజర్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ… మొన్న అయోధ్యలో ఆ రాముల వారికి ప్రాణ ప్రతిష్ట జరిగితే.. ఈ రోజు ‘అలనాటి రామచంద్రుడు’ టీజర్ బయటికి వచ్చింది. యాదృచ్ఛికంగా ఈ సినిమా టైటిల్ తో అది చక్కగా కుదిరింది. దర్శకుడు, నిర్మాత ఇలా అందరూ కొత్త టీంతో చేస్తున్న ఈ ప్రయత్నం బావుంది. ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే సినిమాని థియేటర్లోకి తీసుకెళ్లడం గొప్ప విషయం. ఇకపై యూనిట్ అంతా చాలా హార్డ్ వర్క్ చేయాలి. సినిమాని ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్ళాలి. టీజర్ చాలా ఆసక్తికరంగా వుంది. మాటలు చాలా బావున్నాయి. మనసుని హత్తుకునేలా వున్నాయి. హీరో, హీరోయిన్ చక్కగా నటించారు. సినిమా కూడా అద్భుతంగా వుండి, ప్రేక్షకుల ఆదరించాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.

హీరో కృష్ణ వంశీ మాట్లాడుతూ.. దిల్ రాజు గారు మాలాంటి కొత్తవారిని ప్రోత్సహించడానికి ఈ వేడుకకు రావడం చాలా అనందంగా వుంది. ఆయనకి మనస్పూర్తిగా కృతజ్ఞతలు. మాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. దర్శకుడు ఆకాష్ గారి సినిమా అంటే చాలా ఇష్టం. చాలా అందంగా పాత్రలని తీర్చిదిద్దారు. సంగీత దర్శకుడు, డీవోపీ.. టీంలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. చాలా మంచి వర్క్ ఇచ్చారు. మోక్ష చాలా అద్భుతంగా నటించింది. ఇందులో చాలా మంచి నటీనటులు వున్నారు. అందరి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. అందరికీ ధన్యవాదాలు’’ తెలిపారు.

హీరోయిన్ మోక్ష మాట్లాడుతూ.. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. దర్శకుడు నా పాత్రని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. వంశీ గారితో వర్క్ చేయడం చాలా గొప్ప అనుభూతి. చాలా మంచి టీంతో కలసి ఈ చిత్రం చేశాం. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.’’ తెలిపారు.

దర్శకుడు చిలుకూరి ఆకాష్ రెడ్డి మాట్లాడుతూ.. దిల్ రాజు గారు టీజర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా వుంది. మా సినిమా గురించి చెప్పాలంటే.. శ్రీరాముల వారు సీతమ్మ కోసం తీసుకున్న గొప్ప నిర్ణయం రామసేతు నిర్మాణం. మా సినిమాలో సిద్దు అనే నిజాయితీ గల వ్యక్తి.. తన ప్రేమని చెప్పడానికి ఒక నిర్ణయం తీసుకుంటాడు. అప్పుడు తను ఎదుర్కున్న సమస్యలు ఏమిటి ? తన ప్రేమని ఎలా చేరుకున్నాడనేది కథ. మా నిర్మాతల ఋణం ఎప్పుడూ తీర్చుకోలేను. మమ్మల్ని నమ్మి ఈ ప్రాజెక్ట్ ని ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు, శశాంక్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. :-ప్రేమ్ సాగర్  వండర్ ఫుల్ విజువల్స్ ఇచ్చారు. టెక్నికల్ టీం అంతా బ్రిలియంట్ గా వర్క్ చేశారు. చైతన్య గారు చాలా మంచి నటన కనబరిచారు. వెంకటేష్ కాకమాను పాత్రని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా చక్కని వినోదం వుంటుంది. మోక్ష ధరణి పాత్రలో ఒదిగిపోయింది. హీరో వంశీ ఈ కథకు పూర్తిగా న్యాయం చేశాడు. ఈ సినిమాతో తనకు చాలా మంచి పేరు వస్తుంది. తను అందరికీ నచ్చుతాడు. ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాయించుకుంటాడు. ఈ చిత్రం ఒక ఎమోషనల్ రైడ్. ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత చాలా హాయిగా బయటికి వస్తారు’’ అన్నారు.

నిర్మాత శ్రీరామ్ జడపోలు మాట్లాడుతూ.. మా టీజర్ లాంచ్ చేసి మమ్మల్ని ఆశీర్వదించిన నిర్మాత దిల్ రాజు గారికి కృతజ్ఞతలు. చిన్నప్పటి నుంచి సినిమా అంటే చాలా ఇష్టం. ఇది మా మొదటి సినిమా. ఇలాంటి ఎన్నో సినిమాలు తీయాలని బలంగా అనుకునే నిర్మాణం మొదలుపెట్టాం. దర్శకుడు ఆకాష్ ఈ కథ చెప్పినపుడు చాలా నచ్చింది. మనసుని ఆకట్టుకునే మాటలు రాశారు. టీం అంతా చాలా ఎనర్జీతో పని చేసింది. మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. తప్పకుండా సినిమా ప్రేక్షకులని అలరిస్తుంది. మీ అందరి ప్రోత్సాహం కావాలి’’ అన్నారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.

నటీనటులు : కృష్ణ వంశీ, మోక్ష,  బ్రహ్మాజీ,  సుధ, ప్రమోదిని, కేశవ్ దీపక్ , వెంకటేష్ కాకుమాను, చైతన్య గరికిపాటి,  దివ్య శ్రీ గురుగుబెల్లి,  స్నేహమాధురి శర్మ తదతరులు

టెక్నికల్ విభాగం :
రచన & దర్శకత్వం :-చిలుకూరి ఆకాష్ రెడ్డి
నిర్మాత:-హైమావతి, శ్రీరామ్ జడపోలు
డీవోపీ:-ప్రేమ్ సాగర్
సంగీతం:-శశాంక్ తిరుపతి
ఎడిటర్:-జే సి శ్రీకర్
పీఆర్వో:-వంశీ-శేఖర్