మల్లూ అర్జున్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయ్యేలానే ఉంది

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో వస్తున్న మూడో చిత్రం అల వైకుంఠపురములో. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సాంగ్స్ రిలీజ్ అయ్యి ఇప్పటికే చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు సినిమా ప్రొమోషన్స్ ని స్ప్రెడ్ చేస్తూ అల్లు అర్జున్ మలయాళ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశాడు. కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ తెలుగు హీరోకి లేనంత ఫాలోయింగ్ బన్నీ సొంతం, వాళ్లు ప్రేమగా అల్లు అర్జున్ ని మల్లూ అర్జున్ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. తన ప్రతి సినిమాని మలయాళంలో డబ్ చేసే అల్లు అర్జున్ ఈసారి అల వైకుంఠపురములో సినిమాని అంగు వైకుంఠపురతు అనే టైటిల్ తో రిలీజ్ చేయనునన్నాడు.

మలయాళ టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్, అంగు వైకుంఠపురతు ఫస్ట్ సాంగ్ ని… అదే మన సామజవరగమనా సాంగ్ ని నవంబర్ 10న విడుదల చేయనున్నారు. పొంగల్ పండక్కి తన సినిమాని రిలీజ్ చేసి సాలిడ్ కలెక్షన్స్ రాబట్టాలని అల్లు అర్జున్ అండ్ టీం వేసిన ప్లాన్ వర్కౌట్ అయ్యేలాగే ఉంది. జనవరి 12న అంగు వైకుంఠపురతు సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.