సుమంత్‌, టీజీ కీర్తికుమార్‌, రెడ్ సినిమాస్ మ‌ళ్లీ మొద‌లైంది ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

గ‌త కొన్నిరోజులుగా సుమంత్ మ‌ళ్లీ పెళ్లిచేసుకోబోతున్నారు అంటూ ఓ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉంది. దీనిపై హీరో సుమంత్ స్పందిస్తూ.. `తాను మళ్లీ పెళ్లి చేసుకోవడం లేదని..  ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమా డైవ‌ర్స్ మ‌రియు రీ మ్యారేజ్ కి సంభందించిన అంశాల‌తో కూడుకున్న‌ద‌ని, తెలుగులో ఇలాంటి క‌థతో  మొద‌టిసారి ఓ సినిమా వ‌స్తుందని అందులో నుండే ఒక వెడ్డింగ్‌కార్డ్ లీకైంద‌ని` వివ‌ర‌ణ ఇచ్చిన విష‌యం తెలిసిందే..

సుమంత్ హీరోగా న‌టిస్తున్న ఆ చిత్రానికి `మ‌ళ్ళీ మొద‌లైంది` అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. విడాకులు.. మళ్లీ పెళ్లి చేసుకోవడం నేపథ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా టీజీ కీర్తికుమార్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. నైనా గంగూలి హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీని రెడ్ సినిమాస్ ప‌తాకంపై కె. రాజ‌శేఖ‌ర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ లో మొద‌టిఫోటోలో  సుమంత్ – నైనా ఒకరినొక‌రు హత్తుకొని బెడ్ మీద పడుకొని ఉండ‌డం  అలాగే రెండో ఫోటోలో వారిద్ద‌రి మ‌ధ్య దూరం మరింత పెరిగినట్లు చూపించారు. విడాకుల తర్వాత జీవితాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారనేది ఈ పోస్టర్ ద్వారా తెలుస్తోంది.

సుహాసిని మ‌ణిర‌త్నం, వెన్నెల కిషోర్‌, మంజుల ఘ‌ట్ట‌మ‌నేని, పోసాని కృష్ణ ముర‌ళి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత ద‌ర్శ‌కుడు. జీఆర్ఎన్ సినిమాటోగ్రాఫ‌ర్.

మ‌ళ్ళీ మొద‌లైంది చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.

తారాగ‌ణం: సుమంత్‌, నైనా గంగూలి, సుహాసిని మ‌ణిర‌త్నం, వెన్నెల కిషోర్‌, మంజుల ఘ‌ట్ట‌మ‌నేని, పోసాని కృష్ణ ముర‌ళి

సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: టీజీ కీర్తి కుమార్‌
నిర్మాత‌: కె. రాజ‌శేఖ‌ర్ రెడ్డి
సంగీతం: అనూప్ రూబెన్స్‌
ఎడిటింగ్: ప్ర‌దీప్ ఇ రాఘ‌వ్‌
ఆర్ట్‌: అర్జున్ సురిశెట్టి
సీఈఒ: చ‌ర‌ణ్ తేజ్‌
పీఆర్ఓ: వంశీ – శేఖ‌ర్‌