బిగ్ బాస్ సీజన్ 8 కొత్త ప్రోమో

రియాల్టీ షో అనగానే తెలుగు వారికి ముందుగా గుర్తొచ్చేది బిగ్ బాస్. ఇప్పటికే 7 సీజన్లు విజయవంతం కాగా ఇప్పుడు 8వ సీజన్ త్వరలోనే రాబోతుంది. ఈ సీజన్ కు సంబంధించి లోగో అలాగే ప్రోమో ఇప్పటికే హల్చల్ చేశాయి. ఇది ఇలా ఉండగా బిగ్ బాస్ సీజన్ 8 నుండి మరొక ప్రోమో విడుదల అయింది. ఆ ప్రోమోను చూస్తుంటే గత ప్రోమోకు కంటిన్యూగా అనిపిస్తుంది. ఈ ప్రోమోలో సత్య అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ కోరతాడు. ఫిమేల్ ఆర్టిస్టులతో నాగార్జున స్టెప్స్ వేస్తూ ఉన్న ఈ పురము బిగ్ బాస్ ఫాన్స్ ను అలాగే నాగార్జున ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేసింది. అయితే ప్రోమో చివరిలో సత్య నాకు ఏకాంతం కావాలి అని కోరగా అతడిని మధ్యలో ప్రత్యక్షమయ్యేల చేయడం జరుగుతుంది. చివరిగా నాగార్జున మాట్లాడుతూ ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో ఎంటర్టైన్మెంట్, ఫన్, టర్న్స్ ఇంకా ట్విస్ట్ లకు లిమిటే లేదంటారు.